Loading...

గోప్యత వెల్లడింపు విధానం

టాటా మోటార్స్ లిమిటెడ్ (ఇకపై "టిఎంఎల్ " గా సూచించబడుతుంది) మీ వ్యక్తిగత డేటా గోప్యత మరియు భద్రతల్ని కాపాడటానికి కట్టుబడింది. మీ వ్యక్తిగత డేటా ప్రక్రియలో ఒక ముఖ్యమైన ఆందోళనగా నిలిచిన మీ గోప్యతని కాపాడటానికి మేము మా వ్యాపార ప్రక్రియలలో ప్రత్యేక శ్రద్ధవహిస్తాము. వర్తించే చట్టబద్ధమైన ఏర్పాట్లకు అనుగుణంగా వ్యక్తిగత డేటా సేకరిస్తాము.

మేము సేకరించిన వ్యక్తిగత డేటా స్వభావం, అలాంటి డేటా లక్ష్యం , దాని ఉపయోగం, అలాంట డేటా యొక్క తదుపరి ప్రక్రియ మరియు మాతో పంచుకున్న అలాంటి వ్యక్తిగత డేటాకి సంబంధించిన మీ హక్కులు గురించి మీకు తెలియచేయడమే ఈ గోప్యతా విధానం కీలకమైన లక్ష్యం. మీ వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించిన మీ హక్కుల్ని ఈ గోప్యతా విధానం మరింత ఏర్పాటు చేస్తుంది. టీఎంఎల్ సేకరించిన ఆ సమాచారం ఏ విధంగా ఉపయోగించబడింది, నిర్వహించబడింది, పంచుకోబడింది, కాపాడబడింది మరియు మీరు దానిని ఏ విధంగా అప్ డేట్ చేయగలరు సమాచారం గురించి ఈ గోప్యతా విధానం వర్ణిస్తుంది. ఎలక్ట్రానిక్ లేదా కాగితం సహా ఏదైనా రూపంలో యూరోపియన్ ఎకనామిక్ ఏరియా ("ఈఈఓ") నుండి టీఎంఎల్ అందుకున్న పూర్తి వ్యక్తిగత డేటాకి కూడా ఇది వర్తిస్తుంది. ఈ క్రింద పోస్ట్ చేయబడిన తేదీకి ఇది అమలవుతుంది మరియు అమలయ్యే తేదీ తరువాత మీ సమాచారాన్ని మేము ఉపయోగించడానికి వర్తిస్తుంది.

గోప్యతా విధానంలో కేటాయించబడిన విధంగా మినహా, సాధారణంగా, మీ వ్యక్తిగత గుర్తింపు లేకుండా మీరు మా వెబ్ సైట్ ని ఉపయోగించవచ్చు /సందర్శించవచ్చు. మిమ్మల్ని మీరు గుర్తించకుండా, చట్టబద్ధంగా, ఆచరణీయంగా ఉన్న చోట వెబ్ సైట్ ని ఉపయోగించడానికి టీఎంఎల్ మీకు ఒక ఆప్షన్ ని అనుమతిస్తుంది. మీ అవసరాల్ని సమర్థవంతంగా తీర్చడానికి మరియు మీరు వెబ్ సైట్ ని సందర్శించిన సమయంలో మీరు అభ్యర్థించిన విధంగా ఉత్పత్తులు, సేవలు లేదా సమాచారం కోసం మెరుగైన సమాచారాన్ని కేటాయించడానికి వెబ్ సైట్ యొక్క కొన్ని విభాగాలకు మీ వ్యక్తిగత డేటా కావాలి. మా వెబ్ సైట్ ని ఉపయోగించే సంబంధంలో ఈ క్రింద నిర్దేశించిన విధంగా నియమాలు, షరతుల్ని మీరు చదివి, అర్థం చేసుకోవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. వెబ్ సైట్ ని ఉపయోగించడంలో మీరు ఈ నియమాల్ని బేషరతుగా అంగీకరించారని విషయం భాగంగా ఉంది. మా గోప్యతా విధానం యొక్క నియమాలు, షరతులను మీరు అంగీకరించినప్పుడే మరియు ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా మీరు కేటాయించిన పూర్తి సమాచారాన్ని ఉపయోగించడానికి టాటా మోటార్స్ లిమిటెడ్ కి మీరు స్వచ్ఛందంగా మీ సమ్మతి తెలిపి మరియు అధికారం ఇచ్చినప్పుడే ఈ వెబ్ సైట్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు మా గోప్యతా విధానం యొక్క నియమాల్ని అంగీకరించకపోతే లేదా వెబ్ సైట్స్ మరియు అక్కడ ఉన్న ఏవైనా విషయాలకు సంబంధించి ఏదైనా కారణానికి మీరు అసంతృప్తిగా ఉంటే, మీరు వెబ్ సైట్ ని మరింత ఉపయోగించడానికి నిషేధించబడతారు.

మీరు ఈ గోప్యతా విధానం చదవాల్సిందిగా మిమ్మల్ని మేమ ప్రోత్సహిస్తున్నాము.

Personal data that we collect

వ్యక్తగిత డేటా అనగా మీరు ఎవరు , మిమ్మల్ని గుర్తించడం, సంప్రదించడం లేదా మీరు ఎక్కడ ఉన్నది కనుగొనడం (ఉదా పేరు, వయస్సు, ఆడ/మగ, మెయిలింగ్ అడ్రస్, టెలీఫోన్ నంబర్ మరియు ఈ-మెయిల్ అడ్రస్ ) సమాచారాన్ని ఉపయోగించడానికి నిర్దిష్టంగా టీఎంఎల్ తెలుసుకోవడానికి సూచించబడే డేటా. సర్వేకి మీరు జవాబులు ఇవ్వడం వంటి పరిస్థితులలో మీరు మాకు కేటాయించినప్పుడు మేము మీ వ్యక్తిగత డేటా సేకరిస్తాము, ఒకవేళ మీరు కార్యక్రమాలు కోసం రిజిస్టర్ చేసినప్పుడు, వ్యక్తిగత సేవలు కోసం నమోదు చేసేటప్పుడు, ఉత్పత్తి లేదా మా సేవలు ఉపయోగించడం గురించి సమాచారాన్ని అభ్యర్థించండి లేదా కస్టమర్ సహాయం కోసం అభ్యర్థించండి. మీ పేరు, చిరునామా, జిప్ కోడ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఐపీ అడ్రస్, మీరు ఉన్న ప్రదేశం గురించి సమాచారం , మీ డివైజ్ గురించి సమాచారం మొదలైనటువంటి పరిస్థితులు కోసం సంబంధించిన మీ వ్యక్తిగత డేటాని కేటాయించాల్సిందిగా మేము మిమ్మల్ని కోరవచ్చు. మీ గురించి టీఎంఎల్ వద్ద ఉన్న వ్యక్తిగత డేటా అంతా నేరుగా ఎల్లప్పుడూ మీ నుండి రాదు. ఉదాహరణకు, మీకు సంబంధించిన మీ యజమాని లేదా ఇతర సంస్థలు నుండి రావచ్చు. అయితే, మీరు ఈ సైట్ తో పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మరియు /లేదా ఈ సైట్ పై అందించిన సేవల్ని వినియోగించినప్పుడు టీఎంఎల్ వ్యక్తిగత డేటాని సేకరిస్తుంది. ఉదాహరణకు:

  • మీరు ఈ సైట్ ద్వారా మీరు ఉద్యోగం లేదా సిబ్బందికి సంబంధించిన ఇతర అవకాశం కోసం మీరు దరఖాస్తు చేసినప్పుడు, మీరు మీ రెజ్యూమ్ , మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, మెయిలింగ్ అడ్రస్ వంటి ఇతర సంప్రదించవలసిన సమాచారం సమర్పించాలని మిమ్మల్ని కోరుతారు. మీరు స్పష్టంగా పేర్కొన్న ఉద్యోగావకాశం కోసం మిమ్మల్ని పరిశీలించడానికి మేము ఈ సమాచారం ఉపయోగిస్తాము. ఈ సైట్ పై ప్రకటన చేయబడిన రెండు అవకాశాలు, ఇతర సిబ్బంది అవసరాలకు సంబంధించి మిమ్మల్ని సంప్రదించడానికి మేము కూడా ఈ సమాచారం ఉపయోగిస్తాము.
  • మా సైట్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ తో మాతో సహకరించడానికి మేము మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్ ని కూడా ఉపయోగించవచ్చు. మా సర్వీస్ ప్రొవైడర్ మా తరపున మీ సమాచారం అందుకుంటారు మరియు ఏదైనా ఇతర లక్ష్యం కోసం ఉపయోగించడానికి అనుమతించబడదు.
  • మీరు ఒక సర్వేకి జవాబు ఇచ్చినప్పుడు మరియు ఈ సైట్ తో లేదా సైట్ పై అందించిన సేవలతో మీరు ఒక సమస్యని నివేదించినప్పుడు నివేదించినప్పుడు సహా మీరు ఈ వెబ్ సైట్ తో ఇతర పరస్పర సంబంధాల్ని కలిగి ఉన్నప్పుడు మేము మిమ్మల్ని వ్యక్తిగత డేటా గురించి అడగవచ్చు.
  • డీలర్ షిప్/డిస్ట్రిబ్యూటర్ షిప్ రూపంలో మీరు మాతో వ్యాపారం చేయాలని కోరుకుంటే మేము మీ వ్యక్తిగత డేటా సేకరిస్తాము. ( డీలర్ షిప్ /డిస్ట్రిబ్యూటర్ ఉయోగాలు కోసం)
  • డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహిచడానికి, కేటాయించడానికి మరియు సేవల్ని మెరుగుపరచడానికి మాకు సహాయపడతాయి, ప్రయోజనం కలిగించవచ్చని మేము భావించిన సేవల్ని అందించడానికి మా భాగస్వాములు, సర్వీస్ ప్రొవైడర్స్ మరియు బహిరంగంగా లభించే వెబ్ సైట్స్ వంటి మూడవ పక్షం నుండి కూడా మేము వ్యక్తిగత డేటా సేకరిస్తాము.
  • క్రెడిట్ /డెబిట్ కార్డ్ వివరాలు సహా చెల్లింపు సమాచారం, బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ ఖాతా రకం, బ్యాంక్ పేర్లు మొదలైనవి మా సంబంధిత గేట్ వేస్ ద్వారా సేకరించబడవచ్చు. అలాంటి డేటా మీ లావాదేవీల్ని ప్రక్రియ చేయడానికి మాత్రమే ఉపయోగించబడతాయి.
  • మోడల్, సంవత్సరం, రంగు, ఆర్ టీఓ రిజిస్ట్రేషన్ నంబర్ సహా ఇన్ వాయిస్ వివరాలు మరియు వారంటీ వివరాలు, డీలర్ పేరు మరియు కొనుగోలు సంవత్సరం సహా వాహనం విక్రయం వివరాలు.
  • మీరు మా వెబ్ సైట్ ఏ విధంగా ఉపయోగించారు వివరాలు.
  • క్యాచీస్, సిస్టం కార్యకలాపం, హార్డ్ వేర్ సెట్టింగ్స్, బ్రౌజర్ రకం, బ్రౌజర్ భాష, మీ సందర్శన యొక్క తేదీ మరియు సమయం వంటి డివైజ్ కార్యకలాపం సమాచారం, ఆ పేజీలు పై గడిపిన సమయం మరియు ఇతర గణాంకాలు మరియు రిఫరల్ యూఆర్ఎల్.

మీ స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా మూడవ పక్షానికి చెందిన మీ వ్యక్తిగత డేటాని మాకు కేటాయించడం ద్వారా ఈ గోప్యతా విధానంలో ఏర్పాటు చేసిన లక్ష్యాలు/వాడకాలు కోసం అలాంటి వ్యక్తిగత డేటాని మాకు వెల్లడించడానికి అలాంటి బంధువులు, స్నేహితులు లేదా మూడవ పక్షం నుండి తగిన సమ్మతి మీరు పొందారని మాకు నిర్థారిస్తున్నారు, హామీ ఇస్తున్నారు.

మీరుమా గోప్యతా విధానం, నియమ, నిబంధనల్ని అంగీకరించినప్పుడు మరియు ఈ గోప్యతా విధానంలో సమాచారం అంతటినీ ఉపయోగించడానికి మీరు టాటా మోటార్స్ లిమిటెడ్ కి స్వచ్ఛందందా సమ్మతి తెలిపి మరియు అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ వెబ్ సైట్ ని యాక్సెస్ చేయగలరు. మీరు మా గోప్యతా విధానం యొక్క నియమాల్ని అంగీకరించకపోతే లేదా వెబ్ సైట్స్ మరియు /లేదా అక్కడ ఉన్న ఏవైనా విషయాలకు సంబంధించి ఏదైనా కారణానికి మీరు అసంతృప్తిగా ఉంటే, మీరు వెబ్ సైట్ ని మరింత ఉపయోగించకుండా నిషేధించబడతారు.

కమ్యూనిటీ డిస్కషన్ బోర్డ్స్

ఆన్ లైన్ కమ్యూనిటీ డిస్కషన్ బోర్డ్స్, బ్లాగ్స్, లేదా ఇతర వ్యవస్థలు ద్వారా ఒకరితో మరొకరు కమ్యూనికేట్ చేయడానికి మా వెబ్ సైట్ యూజర్లకు వీలు కల్పిస్తుంది. అలాంటి డిస్కషన్ బోర్డ్స్ పై పోస్ట్ చేసిన విషయాల్ని మేము ఫిల్టర్ చేయము లేదా పర్యవేక్షించము. ఏవైనా వ్యక్తిగత వివరాల్ని వెల్లడించినప్పుడు మీరు జాగ్రత్తవహించాలి, ఎందుకంటే అలాంటి సమాచారాన్ని మా గోప్యతా విధానం రక్షించదు లేదా అలాంటి పోస్టింగ్స్ ద్వారా మీరు మీ వ్యక్తిగత వివరాలు వెల్లడించాలని నిర్ణయించినప్పుడు మేము బాధ్యతవహించము. ఇంకా, బహిరంగంగా వెల్లడించడానికి మీరు మా వెబ్ సైట్ పై మీ వ్యక్తిగత వివరాల్ని పోస్ట్ చేసినప్పుడు అవి ఇంటర్నెట ద్వారా ప్రపంచవ్యాప్తంగా లభిస్తాయి. అలాంటి సమచారం ఇతరులు ఉపయోగించడాన్ని లేదా దుర్వినియోగపరచడాన్ని మేము నివారించలేము.

టీఎంఎల్ వెబ్ సైట్స్ ఇతర వెబ్ సైట్స్ కి లింక్స్ ని కలిగి ఉండవచ్చు. టీఎంఎల్ గోప్యత కోసం బాధ్యతవహించదు లేదా అలాంటి వెబ్ సైట్స్ కంటెంట్స్ ని :

  • మీరు మా వెబ్ సైట్ నుండి లింక్స్ ని ఉపయోగించి మూడవ పార్టీకి చెందిన వెబ్ సైట్ ని యాక్సెస్ చేసినప్పుడు బాధ్యతవహించదు; లేదా
  • మూడవ పార్టీకి చెందిన వెబ్ సైట్ నుండి మీరు మా వెబ్ సైట్ ని లింక్ చేసినప్పుడు.

మీ వ్యక్తిగత డేటాని మేము ఏ విధంగా ఉపయోగిస్తాము.

మీ వ్యక్తిగత డేటాని ఉపయోగించడానికి మాకు తగిన కారణం ఉన్నప్పుడు మాత్రమే మేము ఆ డేటాని ఉపయోగిస్తాము. ఈ క్రింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలు కోసం మాత్రమే మేము మీ డేటాని ఉపయోగిస్తాము :

  • మాకు మీతో ఉన్న ఒప్పందాన్ని నెరవేర్చడానికి, లేదా
  • ఒక ప్రత్యేకమైన కారణానికి మీ డేటాని ఉపయోగించడానికి మాకు చట్టబద్ధమైన బాధ్యత ఉన్నప్పుడు, లేదా
  • డేటాని ఉపయోగించడానికి మాకు సమ్మతి లభించినప్పుడు, లేదా
  • మీ డేటా ఉపయోగించడానికి వాణిజ్యపరమైన కారణాలు లేదా మా వ్యాపార కారణాలుగా నిలిచిన మా చట్టబద్ధమైన ప్రయోజనాలుగా ఉన్నప్పుడు , అయితే అప్పుడు కూడా మీకు ఉత్తమమైన విషయాలని మించి మేము అన్యాయంగా మా చట్టబద్ధమైన ప్రయోజనాల్ని ఉంచము.

మీ సమాచారం ఉపయోగించడం అనేది మేము ఉపయోగించే సమయంలో గోప్యతా నోటీసుకు లోబడి ఉంటుంది . మా సాధారణ వ్యాపారం వాడకానికి గాను మాకు కేటాయించిన సమాచారాన్ని టీఎంఎల్ ఉపయోగిస్తుంది:

  • మీ అభ్యర్థనలకు జవాబులు ఇవ్వడానికి;
  • కస్టమర్ సర్వీసెస్ సమస్యలుతో సహా మీకు సేవలు కేటాయించడానికి;
  • మా గురించి లేదా మా అనుబంధ ప్రస్తుత సేవలు, కొత్త సేవలు లేదా మేము అభివృద్ధి చేస్తున్న సేవలు గురించి మీకు తెలియేచేయడానికి మరియు మీకు లభించే అవకాశాలు;
  • మా సేవలకు మెరుగుదలలు లేదా కొత్త ఫీచర్స్ గురించి మీకు అప్రమత్తం కలిగించడానికి.
  • ఉద్యోగం లేదా కెరీర్ అవకాశాలు గురించి మీరు చేసిన అన్వేషణతో కమ్యూనికేట్ చేయడానికి ;
  • మా సైట్ మరియు మా సేవలు మీ కోసం ఒక ప్రభావవంతమైన విధానంలో పని చేయడాన్ని నిర్థారించడానికి;
  • ప్రకటన మరియు చేరుకోవడం ప్రభావం గురించి అర్థం చేసుకోవడం లేదా కొలవడం.
  • వెబ్ సైట్స్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, నియమాలు, షరతులలో మార్పులు, యూజర్ ఒప్పందాలు మరియు పాలసీలు మరియు /లేదా ఇతర పరిపాలనా సంబంధమైన సమాచారం మీకు పంపించడానికి.
  • మార్కెటింగ్ మరియు కార్యక్రమాలు: ఈమెయిల్, టెలీఫోన్, టెక్స్ట్ సందేశాలు, ప్రత్యక్ష మెయిల్ మరియు ఆన్ లైన్ వంటి వివిధ వేదికలలో మార్కెటింగ్ మరియు కార్యక్రమాల కమ్యూనికేషన్స్ అందించడానికి మేము వ్యక్తిగత సమాచారం ఉపయోగిస్తాము. మేము మీకు మార్కెటింగ్ ఈమెయిల్ పంపించితే, భవిష్యత్తులో ఈ ఈమెయిల్స్ ని అందుకోవడం నుండి ఏ విధంగా నిలిపివేయాలి విషయం గురించి సూచనలు కూడా దీనిలో కలిపి ఉంటాయి. మీ సమాచారం మరియు మార్కెటింగ్ ప్రాధాన్యతల్ని నిర్వహించడానికి మీ కోసం ఈమెయిల్ ప్రాధాన్యతల కేంద్రాల్ని కూడా మేము నిర్వహిస్తాము. మీరు మార్కెటింగ్ ఈమెయిల్స్ అందుకోవడానికి నిలిపివేసినా కూడా, మీ అకౌంట్స్ మరియు సబ్ స్క్రిప్షన్స్ కి సంబంధించిన ముఖ్యమైన సేవా సమాచారం మేము ఇప్పటికీ మీకు పంపించవచ్చు.
  • సంభావ్య ఉల్లంఘనల్ని దర్యాప్తు చేయడానికి లేదా టీఎంఎల్ మరియు మా వెబ్ సైట్ యూజర్స్ యొక్క హక్కులు, ఆస్థి లేదా భద్రతని కాపాడటానికి .
  • చట్టబద్ధమైన బాధ్యతలు : నేరం నివారణ, గుర్తించడం లేదా దర్యాప్తు; నష్టం నివారణ; లేదా మోసం వంటి చట్టబద్ధమైన మరియు అనుసరణ కారణాలు కోసం వ్యక్తిగత సమాచారం మేము ఉపయోగించడానికి మరియు నిలిపి ఉంచడానికి అవసరం కావచ్చు. మా లోపలి మరియు బయటి ఆడిట్, సమాచారం భద్రతా లక్ష్యాల ఆవశ్యకతల్ని తీర్చడానికి మరియు వేరొక విధంగా అవసరమని లేదా సరైనదని మేము నమ్మిన కారణంగా మేము వ్యక్తిగత సమాచారం ఉపయోగించవచ్చు:
  • వర్తించే చట్టం క్రింద, మీరు నివసించే దేశానికి బయట చట్టాలు కూడా భాగంగా ఉండవచ్చు ;
  • న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు మరియు ఇతర ప్రజా మరియు ప్రభుత్వ సంస్థలు చేసిన అభ్యర్థనలకు జవాబులు ఇవ్వటానికి, దీనిలో మీరు నివసించే దేశానికి ఆవల ఉండే అధికారిక సంస్థలు వంటివి భాగంగా ఉంటాయి;

మీ కోసం సేవలు చేయడానికి లేదా మీరు కోరిన సమాచారానికి జవాబులు ఇవ్వడానికి తగిన అవసరమైన అలాంటి సమాచారాన్ని మాత్రమే సేకరించడానికి మేము ప్రయత్నిస్తాము. మీరు కేటాయించిన సమాచారం ఖచ్చితంగా, పూర్తిగా మరియు వర్తమానం సమాచారం నిర్థారించడానికి మీరు బాధ్యులు.

మీరు మా వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్ లేదా ఏదైనా ఇతర విధానం పై మిమ్మల్ని సంప్రదించాల్సిన వివరాలు కేటాయించడం ద్వారా , టీఎంఎల్ నుండి లేదా ఏదైనా దాని సంబంధిత/అనుబంధ సంస్థ నుండి ఈమెయిల్, ఎస్ఎంఎస్ , ఫోన్ కాల్ మరియు /లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందుకోవడానికి మీరు అంగీకరించారు.

టీఎంఎల్ తన స్వంత నిర్ణయాధికారానికి లోబడి , టీఎంఎల్ వెబ్ సైట్ యొక్క పూర్తి భాగం లేదా ఏదైనా భాగం మరియు సంబంధిత సేవలు లేదా అక్కడ ఉన్న ఏదైనా భాగాన్ని ముందుగా తెలియచేయకుండానే ఏ సమయంలోనైనా మీరు యాక్సెస్ చేయడాన్ని రద్దు చేసే హక్కు టీఎంఎల్ కి ఉంది.

మేము వ్యక్తిగత డేటాని పంచుకున్నప్పుడు

సేవల్ని కేటాయించడం అవసరమైనప్పుడు లేదా మా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాల్సిన సమయంలో టీఎంఎల్ వ్యక్తిగత డేటా వెల్లడిస్తుంది లేదా పంచుకుంటుంది. టీఎంఎల్ మీ వ్యక్తిగత డేటాని బయటకి బదిలీ చేయాలని ఉద్దేశ్యించినప్పుడు, మీ గోప్యతా హక్కులు రక్షించబడటం కొనసాగేలా నిర్థారించడానికి టీఎంఎల్ చర్యలు తీసుకుంటుంది మరియు కావల్సినంత రక్షణ అమలయ్యేలా నిర్థారిస్తుంది. మేము మీ గురించి ఏదైనా ప్రత్యేక శ్రేణులకు చెందిన వ్యక్తిగత డేటాని సేకరించము (దీనిలో మీ జాతి లేదా దేశం, మతం లేదా దార్శనికత నమ్మకాలు, లైంగిక జీవితం, లైంగిక ధోరణి, రాజకీయ అభిప్రాయాలు, ట్రేడ్ యూనియన్ సభ్యత్వం, మీ ఆరోగ్యం, జన్యుపరమైన డేటా మరియు బయోమెట్రిక్ డేటా గురించి సమాచారం దీనిలో భాగంగా ఉంటుంది) . నేరపూరితమైన ఆరోపణలు మరియు నేరాలు గురించి మేము ఎలాంటి సమాచారం సేకరించము.

మీ సమ్మతితో టీఎంఎల్, ఈ సైట్ పై ప్రకటించిన లేదా మా అనుబంధ సంస్థలలో ఒక సంస్థ వెబ్ సైట్ పై ప్రకటించిన అవకాశాల సంబంధంలో సిబ్బంది అవకాశాలు కోసం మీ దరఖాస్తుకి సంబంధించి టీఎంఎల్ యొక్క అనుబంధం లేని మూడవ పార్టీ కస్టమర్స్ కి మీ గురించి సమాచారం వెల్లడించబడుతుంది

టీఎంఎల్ లో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వ్యాపారాల్ని వివిధ టీఎంఎల్ బృందాలు, విధులుచే మద్దతు చేయబడుతున్నాయి మరియు సేవలు, అకౌంట్ నిర్వహణ, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్, టెక్నికల్ మద్దతు, వ్యాపారం మరియు ఉత్పత్తి అభివృద్ధి సంబంధంలో ఏర్పాటు కోసం అవసరమైతే వ్యక్తిగత సమాచారం వారికి కేటాయించబడుతుంది. వ్యక్తిగత డేటాని నిర్వహించేటప్పుడు మా ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్స్ అందరూ మా డేటా రక్షణ మరియు భద్రతా విధానాల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది.

అనుబంధ సంస్థలు: Our parent company, subsidiaries, joint ventures, group and associate companies. These entities may use this information for the purposes outlined above.

డీలర్స్: : స్వతంత్రంగా సొంతం చేసుకోబడి, ఆపరేట్ చేయబడే మా అథీకృత డీలర్స్. మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, నేరవేర్చడం మరియు సంబంధిత లక్ష్యాలు సహా తమ ప్రతిరోజూ వ్యాపార లక్ష్యాలు కోసం వారు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

డిస్ట్రిబ్యూటర్స్: స్వతంత్రంగా సొంతం చేసుకోబడి, ఆపరేట్ చేయబడే మా అథీకృత డిస్ట్రిబ్యూటర్స్ . మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, నేరవేర్చడం మరియు సంబంధిత లక్ష్యాలు సహా తమ ప్రతిరోజూ వ్యాపార లక్ష్యాలు కోసం వారు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

మా వ్యాపార భాగస్వాములు: సహ-బ్రాండెడ్ సేవలు అందించడానికి, కంటెంట్ కేటాయించడానికి లేదా కార్యక్రమాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించడానికి మేము అప్పుడప్పుడు ఇతర సంస్థలతో సహకరిస్తాం. ఈ ఏర్పాట్లలో భాగంగా, మీరు మా భాగస్వాములు మరియు టీఎంఎల్ రెండిటి కస్టమర్ కావచ్చు మరియు మేము మీ గురించి సమాచారం సేకరించి, పంచుకోవచ్చు. టీఎంఎల్ గోప్యతా నోటీసుకు అనుగుణంగా వ్యక్తిగత డేటాని నిర్వహిస్తుంది.

మూడవ పక్షం సర్వీస్ ప్రొవైడర్స్: మేము అవసరమైన ఏదైనా మద్దతు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ తో సహకరిస్తాం. సాఫ్ట్ వేర్, సిస్టం, ప్లాట్ ఫాం మద్దతు; ప్రత్యక్ష మార్కెటింగ్ సేవలు; క్లౌడే హోస్టింగ్ సేవలు; ప్రకటన; మరియు ఆర్డర్ నెరవేర్చడం మరియు డెలివరీ వంటి మాకు కేటాయించిన సేవల్ని నెరవేర్చడానికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ పార్టీలకు వ్యక్తిగత డేటా కేటాయించబడుతుంది. మాకు సేవలు కేటాయించడం కాకుండా ఏవైనా ఇతర లక్ష్యం కోసం వారికి మేము అందించిన వ్యక్తిగత డేటా ఉపయోగించడానికిలేదా పంచుకోవడానికి మా మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ అనుమతించబడరు. ఇంకా, మీ వ్యక్తిగత డేటా వివరాల్ని మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ ప్రక్రియ చేయడానికి మేము అప్పగిస్తే, సరైన లేదా అనుకూలమైన సాంకేతిక మరియు భౌతిక రక్షణ కవచాల్ని నిర్వహించగలిగే మూడవ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ ని మేము ఎంచుకుంటాము మరియు అలాంటి మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ ని నియంత్రించి, పర్యవేక్షిస్తాము. మార్కెటింగ్ లక్ష్యాలు కోసం మేము మీ వ్యక్తిగత వివరాల్ని విక్రయించము లేదా కిరాయికి ఇవ్వము. అయితే, డేటా సేకరణ లక్ష్యాలు కోసం మేము మీ వ్యక్తిగత డేటాని ఉపయోగించవచ్చు, ఇది మా వివేచన మేరకు ఇతర పార్టీలకు విక్రయించబడవచ్చు. అలాంటి ఏదైనా డేటా సమూహం మీ వ్యక్తిగత డేటా వివరాల్ని కలిగి ఉండదు. మీ సమ్మతి లేకుండా ' ప్రత్యేక సంరక్షణ అవసరమైన వ్యక్తిగత సమాచారం ' అనగా మీ మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, వీధి చిరునామా, పట్టణం, రాష్ట్రం, , ప్రాంతం, కుకీస్ మరియు ఈమెయిల్స్, ఇంటర్నెట్ మొదలైనవి ఈమెయిల్స్, ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వారా మాకు సేవలు అందించడానికి మేము నియామకం చేసుకునే మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ కి మినహా పైన పేర్కొనబడిన డేటా సేకరణ లక్ష్యంలో వర్ణించబడిన మీ వ్యక్తిగత వివరాలు ఏవైనా మేము కేటాయించవచ్చు. ఈ మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ లో ఇవి భాగంగా ఉండవచ్చు కానీ ఇవి మాత్రమే పరిమితం కాదు: చెల్లింపు ప్రాసెసర్స్, అన్ని కేంద్రాలు, డేటా నిర్వహణ సేవలు, హెల్ప్ డెస్క్ ప్రొవైడర్స్, అకౌంటెంట్స్, లా సంస్థలు, ఆడిటర్స్, షాపింగ్ కార్ట్ మరియు ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ మరియు షిప్పింగ్ కంపెనీస్. అలాంటి మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ కి మీ వ్యక్తిగత డేటా యొక్క ఏర్పాటుకు సంబంధించిన సరైన లేదా అనుకూలమైన సాంకేతిక మరియు భౌతిక రక్షణల్ని మేము నిర్వహిస్తాం. అలాంటి మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ కి మీ వ్యక్తిగత డేటా యొక్క ఏర్పాటు కొనసాగించవద్దని మీరు అభ్యర్థన చేసినప్పుడు, అలాంటి మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ కి మీ వ్యక్తిగత డేటా యొక్క ఏర్పాటుని మేము కొనసాగించము. అలాంటి రక్షణల కాపీని మీరు పొందాలని కోరుకున్నప్పుడు లేదా మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ కి మీ వ్యక్తిగత వివరాలు యొక్క ఏర్పాటుని కొనసాగించవద్దని మీరు కోరుకున్నప్పుడు, మీ అభ్యర్థనతో మాకు dpr@tatamotors.com పై ఈమెయిల్ పంపించండి. ఏదైనా మూడవ పక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్స్ కి మేము మీ వ్యక్తిగత వివరాల్ని కేటాయించినప్పుడు లేదా ఏదైనా మూడవ పక్షం నుండి వ్యక్తిగత వివరాల్ని అందుకున్నప్పుడు, మేము అలాంటి ఏర్పాటు లేదా స్వీకారం గురించి నమోదు చేస్తాము. ఇంకా, ఏదైనా మూడవ పక్షం నుండి మేము వ్యక్తిగత వివరాల్ని అందుకున్నప్పుడు, అలాంటి వ్యక్తిగత వివరాల్ని పొందే పరిస్థితులు గురించి మేము తనిఖీ చేస్తాము.

చట్టబద్ధమైన కారణాలు కోసం మూడవ పక్షాలు: వ్యక్తిగత డేటా అవసరమని మేము విశ్వసించినప్పుడు, మేము అందచేస్తాము, అనగా:

  • చట్టబద్ధమైన బాధ్యతల్ని అనుసరించడానికి మరియు చట్టాన్ని అమలు చేసే సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు సహా ప్రభుత్వ ఏజెన్సీలు నుండి వచ్చిన అభ్యర్థనలకు జవాబులు ఇవ్వడం, దీనిలో మీరు నివసించే దేశానికి బయట ఉన్న అలాంటి సంస్థలు సహా భాగంగా ఉన్నాయి.
  • విలీనం, సేల్, పునర్నిర్మాణం, సంపాదించడం, ఉమ్మడి ఒప్పందం, కేటాయింపు, బదిలీ లేదా మా పూర్తి వ్యాపారం యొక్క ఇతర ఏర్పాటు లేదా ఏదైనా భాగం , ఆస్థులు లేదా స్టాక్ ( ఏదైనా దివాలా లేదా అటువంటి కార్యకలాపాలు సంబంధంలో సహా) జరిగినప్పుడు
  • మా యొక్క, యూజర్లు, సిస్టంస్, మరియు సర్వీసెస్ హక్కులు కాపాడటానికి.

మేము వ్యక్తిగత డేటాని భద్రపరిచి మరియు ప్రక్రియ చేసే చోట

ఒక అంతర్జాతీయ సంస్థగా టీఎంఎల్, మేము సేకరించిన సమాచారం ఈ గోప్యతా ప్రకటనకు మరియు డేటా ఉన్న చోట అనుగుణంగా ప్రక్రియ చేయబడటాన్ని మరియు వర్తించే చట్టం యొక్క ఆవశ్యకతలని నిర్థారించడానికి మేము చర్యలు తీసుకుంటాము. టీఎంఎల్ కి ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్స్, డేటాబేసెస్, సర్వర్స్, సిస్టంస్, మద్దతు మరియు మా కార్యాలయాలు అంతటా ఉన్న హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. మా వ్యాపారం , సిబ్బంది మరియు కస్టమర్స్ అవసరాలు తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లౌడ్ హోస్టింగ్ సర్వీసెస్, సప్లైయర్స్ మరియు సాంకేతికత మద్దతు వంటి మూడవ పక్షాలతో మేము సహకరిస్తాం. వర్తించే చట్టానికి అనుగుణంగా వ్యక్తిగత డేటా ప్రక్రియ చేయబడి, రక్షించబడి మరియు బదిలీ చేయబడటాన్ని నిర్థారించడానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము.

టీఎంఎల్ మీ వ్యక్తిగత డేటాని ఎవరికీ విక్రయించదు లేదా అద్దెకి ఇవ్వదు. మీరు అభ్యర్థించిన ఉత్పత్తి లేదా సర్వీస్ కేటాయించవలసిన కొన్ని కేసులలో, మీ వ్యక్తిగత డేటాని టీఎంఎల్ లోపల లేదా మూడవ పక్షానికి వెల్లడించి లేదా బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసేటప్పుడు మీ మాతృదేశంలో ఉన్న విధంగా డేటా గోప్యతని అదే స్థాయిలో రక్షణని ఇతర దేశాల్లో ఉండే వర్తించబడే చట్టాలు ఇవ్వకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో డేటా గోప్యత రక్షించబడటానికి మేము తగిన స్థాయిలో చర్యలు తీసుకుంటాము. ఉదాహరణకు, మీ వ్యక్తిగత సమాచారం అందుకున్న వారు దానిని రక్షించడాన్ని నిర్థారించడానికి మేము ఆమోదించబడిన ఒప్పందపరమైన క్లాజెస్, బహు పార్టీల డేటా బదిలీ ఒప్పందాలు, పరస్పర సమూహ ఒప్పందాలు మరియు రూపొందించబడిన ఇతర చర్యలు మేము ఉపయోగిస్తాము.

మేము వ్యక్తిగత డేటాని ఏ విధంగా రక్షిస్తాము.

మీ వ్యక్తిగత డేటాని కాపాడటానిక టీఎంఎల్ సరైన సాంకేతికతలు మరియ ప్రక్రియల్ని ఉపయోగిస్తుంది. మా సమాచారం భద్రతా విధానాలు మరియు ప్రక్రియలు విస్త్రతంగా ఆమోదించబడిన అంతర్జాతీయ ప్రమాణాలచే సన్నిహితంగా అనుసంధానం చేయబడ్డాయి మరియు క్రమం తప్పకుండా సమీక్షించబడ్డాయి మా వ్యాపార అవసరాలు, సాంకేతికతలో మార్పులు, చట్టబద్ధమైన ఆవశ్యకతలు నెరవేర్చడానికి అవసరమైన విధంగా నవీకరించబడ్డాయి. ఉదాహరణకు,

  • విధానాలు మరియు ప్రక్రియలు: మీ వ్యక్తిగత డేటా దుర్వినియోగం, మార్పు, నష్టపోకుండా లేదా ఉద్దేశ్యపూర్వకం కాని నాశనం నుండి కాపాడటానికి టీఎంఎల్ తగిన సాంకేతికత, భౌతిక మరియు ఆపరేషనల్ భద్రతా ప్రక్రియల్ని వినియోగిస్తుంది. మీ గురించి సేకరించిన పూర్తి డేటా కోసం సరైన భద్రతని కేటాయించే ప్రయత్నంలో భాగంగా మా భద్రతా చర్యలు క్రమానుగతంగా సమీక్షించబడతాయి మరియు నవీకరించబడతాయి.
  • మీ వ్యక్తిగత డేటాని యాక్సెస్ చేయడం పై మేము తగిన నిబంధనల్ని ఉంచాము.
  • డేటాని సురక్షితంగా భద్రపరచడానికి మరియు బదిలీ చేయడానికి పర్యవేక్షణ మరియు భౌతిక చర్యలు సహా మేము తగిన భద్రతా చర్యలు మరియు నియంత్రణల్ని మేము అమలు చేస్తాము.
  • వ్యక్తిగత డేటాకి యాక్సెస్ కలిగిన మా ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్స్ కోసం గోఫ్యత, సమాచారం భద్రత మరియ ఇతర వర్తించే శిక్షణ మాకు క్రమం తప్పకుండా కావాలి.
  • మా సమాచారం భద్రతా విధానాలు మరియు ప్రక్రియలకు మరియు ఏవైనా వర్తించే ఒప్పందాల షరతులకు అనుగుణంగా మా ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్స్ ఆపరేట్ చేయడాన్ని నిర్థారించడానికి మేము చర్యలు తీసుకున్నాము.
  • మా భద్రతా విధానాలు మరియు ప్రక్రియలకు అనుగుణంగా వారికి కేటాయించబడిన ఏదైనా వ్యక్తిగత డేటాని రక్షించడానికి మాకు కాంట్రాక్ట్స్ మరియు భద్రతా సమీక్షలతో , మా మూడవ పక్షానికి చెందిన వెండర్స్ మరియు ప్రొవైడర్స్ మాకు కావాలి.

కుకీస్

ఎప్పటికప్పుడు, 'కుకీ ' గా పిలువబడే ప్రామాణిక సాంకేతికతని మేము ఉపయోగిస్తాము. కంప్యూటర్ పై లేదా ఇతర డివైజ్ పై ఉంచబడే కుకీ అనేది ఒక చిన్న టెక్ట్స్ ఫైల్ మరియు యూజర్ లేదా డివైజ్ ని గుర్తించడానికి మరియు సమాచారం సేకరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. కుకీస్ వాటి పనితీరు మరియు ఉద్దేశ్యించబడిన లక్ష్యాన్ని బట్టి సాధారణంగా నాలుగు శ్రేణులలో ఒక దానికి కేటాయించబడతాయి: అవసరమైన కుకీస్, పనితీరు కుకీస్, సామర్థ్యపు కుకీస్ మరియు మార్కెటింగ్ లక్ష్యాలు కోసం కుకీస్. మీ హార్డ్ డ్రైవ్ నుండి కుకీ ఏదైనా ఇతర డేటాని తిరిగి సంపాదించలేదు, కంప్యూటర్ వైరస్ లు పంపించలేదు లేదా మీ ఈ-మెయిల్ అడ్రస్ తెలుసుకోలేదు. యూజర్స్ సందర్శనని మెరుగుపరచడానికి ప్రస్తుతం, వెబ్ సైట్స్ కుకీస్ ని ఉపయోగిస్తున్నాయి; సాధారణంగా, కుకీస్ యూజర్ ఐడీ మరియు పాస్ వర్డ్ ని సురక్షితంగా భద్రపరుస్తాయి, హోమ్ పేజెస్ ని వ్యక్తిగతం చేస్తాయి మరియు సైట్ లో ఏ భాగాన్ని సందర్శించారో గుర్తిస్తాయి. కుకీని ఉంచినప్పుడు మీకు తెలియచేసే విధంగా మీ బ్రౌజర్ ని ఏర్పాటు చేయడం సాధ్యమే. ఈ విధంగా మీరు కుకీని ఆమోదించాలా , వద్దా అని మీరు నిర్ణయించే అవకాశం లభిస్తుంది. ఈ వెబ్ సైట్ ని మా సందర్శకులు ఎలా మరియు ఎప్పుడు ఉపయోగించారో చూపించడం ద్వారా, నిరంతరంగా మా సైట్ ని మెరుగుపరచడంలో ఈ సమాచారం మాకు సహాయపడుతుంది. మీరు అదనంగా మాకు ప్రత్యేకించి సమాచారం ఇచ్చినప్పుడు మినహా కుకీస్ మాకు మీ గురించి వ్యక్తిగత సమాచారం తెలియచేయవు. మేము లేదా మూడవ పక్షాలు నుండి పొందిన ఏదైనా వ్యక్తిగతంగా గుర్తించబడే సమాచారంతో మా కుకీ సమాచారాన్ని టీఎంఎల్ విలీనం చేయదు లేదా సంబంధాన్ని కలిగి ఉండదు.

మేము కుకీస్ ని ఉపయోగించడానికి గల కారణం : (i) వెబ్ సైట్ కి మీరు చేసిన సందర్శనలు లెక్కించడానికి ; (ii) వెబ్ సైట్ వాడకం పై అనామకమైన, మొత్తం గణాంక సమాచారం పోగు చేయడానికి ; (iii) మీ అవసరం లేదా వ్యూయింగ్ చరిత్ర ప్రకారం సరైన కంటెంట్ ని కేటాయించడం; మరియు (iv) మీ పాస్ వర్డ్ ని సేవ్ చేయడానికి ( కేవలం మీరు మాత్రమే ఆ విధంగా చేయడానికి అనుమతించడం). కాబట్టి మీరు మా సైట్స్ ని సందర్శించిన ప్రతిసారీ మీరు మళ్లీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కుకీస్ ని డిజేబుల్ కూడా చేయవచ్చు. మీ బ్రౌజర్ ప్రాధాన్యతల్ని సవరించడం ద్వారా, మీరు అన్ని కుకీస్ ని తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు లేదా కుకీని సెట్ చేసినప్పుడు నోటిఫికేషన్ కోసం అభ్యర్థన చేయవచ్చు.

ఖచ్చితంగా అవసరమైన కుకీస్

కంటెంట్ చూపించడానికి, లాగింగ్ ఇన్ కోసం, మీ సెషన్ ని ధృవీకరించడానికి, సర్వీసెస్ కోసం మీ అభ్యర్థనకు జవాబు ఇవ్వడానికి మరియు ఇతర పనులు కోసం వెబ్ సైట్ సక్రమంగా పని చేయడానికి ఈ కుకీస్ కావాలి. కుకీస్ వాడకాన్ని డిజేబుల్ చేయడానికి చాలా వెబ్ బ్రౌజర్స్ సెట్ చేయబడతాయి. అయితే, మీరు ఈ కుకీస్ ని డిజేబుల్ చేసినట్లయితే, మీరు మా వెబ్ సైట్ పై ఫీచర్స్ ని సరిగ్గా లేదా అసలు పూర్తిగా యాక్సెస్ చేయలేకపోవచ్చు .

పిల్లలు

మేము నేరుగా పిల్లలకు సర్వీసెస్ కేటాయించము లేదా వారి వ్యక్తిగత సమాచారాన్ని ముందస్తుగా సేకరించము. మా వెబ్ సైట్ ఉపయోగించడానికి తల్లితండ్రులు లేదా సంరక్షకులు పిల్లలకు అధికారం ఇవ్వవచ్చు అయితే టీఎంఎల్ సైట్ ని ఉపయోగించడం మరియు వారు యాక్సెస్ చేయడాన్ని పర్యవేక్షించడం సహా , ఇందుకు మాత్రమే పరిమితం కాకుండా, అలాంటి పిల్లల ప్రవర్తనకు అన్ని రకాల చట్టబద్ధమైన బాధ్యత, జవాబుదారీతనం తల్లితండ్రులు, సంరక్షకులు వహించాలి.

పిల్లల వ్యక్తిగత డేటా ధృవీకరించబడిన తల్లితండ్రి అనుమతి లేకుండా సేకరించబడిందన టీఎంఎల్ తెలుసుకుంటే, అలాంటి సమాచారాన్ని డిలీట్ చేయడానికి టీఎంఎల్ సరైన చర్యు తీసుకోగలదు. అయితే, మీ పిల్లలు ఆమె/అతని డేటాని టీఎంఎల్ కి సమర్పించారని మీరు గుర్తిస్తే, టీఎంఎల్ డేటాబేస్ నుండి అలాంటి డేటా డిలీట్ చేయాల్సిందిగా మీరు ఈ-మెయిల్ ద్వారా అభ్యర్థించవచ్చు. అభ్యర్థనని అందుకున్నప్పుడు, తమ డేటాబేస్ నుండి అలాంటి సమాచారాన్ని డిలీట్ చేయడాన్ని టీఎంఎల్ నిర్థారిస్తుంది.

మీ హక్కులు మరియు మీ వ్యక్తిగత డేటా

మీ యొక్క సమాచారాన్ని యాక్సెస్ చేసి మరియు నియంత్రించే మీ హక్కుని మేము గౌరవిస్తాం మరియు సమాచారం కోసం అభ్యర్థనలకు మేము ప్రతిస్పందిస్తాం మరియు వర్తించే చోట, మీ వ్యక్తిగత సమాచారాన్ని సరి చేస్తాం, సవరిస్తాం లేదా డిలీట్ చేస్తాం.

అలాంటి కేసుల్లో, ఈ హక్కుల్ని అమలు చేయడానికి ముందు మీరు మీ గుర్తింపు ప్రూఫ్ తో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది.

  • సమాచారం యాక్సెస్ చేసే హక్కు: : మేము కలిగి ఉన్న మీ సమాచారం గురించి, మా వద్ద ఆ సమాచారం ఎందుకు ఉన్నది, సమాచారాన్ని ఎవరు యాక్సెస్ చేసారు మరియు ఆ సమాచారాన్ని మేము ఎక్కడ నుండి సంపాదించాము అభ్యర్థించడానికి ఏ సమయంలోనైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీ నుండి అభ్యర్థనని అందుకున్న నెల రోజులు లోగా ప్రతిస్పందిస్తాము. మొదటి అభ్యర్థనకి ఎలాంటి ఫీజు లేదా ఛార్జెస్ లేవు కానీ అదే డేటా కోసం చేసిన అదనపు అభ్యర్థనకు అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యాక్సెస్ ని అభ్యర్థించడానికి మీరు కారణం చెప్పనవసరం లేదు కానీ మీరు మీ గుర్తింపుకి కొన్ని తగిన ఆధారాలు కేటాయించాల్సిన అవసరం ఉంది.
  • సమాచారాన్ని సరిచేసి మరియు నవీకరించే హక్కు: మా వద్ద ఉన్న మీ డేటా అసంపూర్ణంగా ఉంటే, పాతది లేదా తప్పుది అయినప్పుడు, మీరు మాకు తెలియచేయవచ్ మరియు మీ డేటా నవీకరించబడుతుంది.
  • మీ సమాచారం తొలిగించవలసిన హక్కు: మేము మీ డేటాని ఇంక ఉపయోగించరాదని లేదా మీ డేటాని మేము అనధికారికంగా ఉపయోగిస్తున్నామని మీరు భావిస్తే , మా వద్ద ఉన్న మీ డేటాని నిర్మూలించవలసిందిగా మీరు మమ్మల్ని అభ్యర్థించవచ్చు. మేము మీ అభ్యర్థనని అందుకున్నప్పుడు డేటా డిలీట్ చేయబడిందా అని మేము నిర్థారిస్తాము లేదా అది డిలీట్ చేయబడకపోవడానికి గల కారణాన్ని మేము మీకు నిర్థారిస్తాం. ( ఉదాహరణకు మా చట్టబద్ధమైన ప్రయోజనాలు లేదా చట్టబద్ధమైన లక్ష్యం (లు)
  • ప్రక్రియకి అభ్యంతరం చెప్పే హక్కు: మీ డేటా ప్రక్రియని ఆపుచేయాల్సిందిగా మీరు అభ్యర్థించే హక్కు హక్కు ఉంది. అభ్యర్థనని అందుకున్న తరువాత, మేము మిమ్మల్ని సంప్రదిస్తాము మరియు మేము అనుసరించగలమా లేదా మీ డేటాని ప్రక్రియ చేయడాన్ని కొనసాగించే చట్టబద్ధమైన కారణాలు మేము కలిగి ఉన్నామా అని మీకు తెలియచేస్తాం. అభ్యంతరం చెప్పే మీ హక్కుని మీరు అమలుచేసిన తరువాత కూడా, మీ ఇతర హక్కుల్ని అనుసరించడానికి లేదా చట్టబద్ధమైన క్లెయిమ్స్ తేవడానికి లేదా సమర్థనకు మేము మీ డేటాని కొనసాగించవచ్చు.
  • డేటా పోర్టబిలిటి హక్కు: మేము మరొక నియంత్రణదారుకి మీ డేటాలో కొంత భాగాన్ని బదిలీ చేయవలసిందిగా అడిగే హక్కు మీకు ఉంది. మీ అభ్యర్థనని అందుకున్న నెల రోజులు లోగా ఆ విధంగా చేయడానికి సాధ్యమైన చోట మేము మీ అభ్యర్థనను అనుసరిస్తాం.
  • మీ సమ్మతిని ఉపసంహరించే హక్కు. సమ్మతి కోరిన డేటా యొక్క ఏదైనా ప్రాసెసింగ్ కోసం ఎప్పుడైనా ప్రాసెసింగ్ కు మీ సమ్మతిని ఉపసంహరించే హక్కు. టెలీఫోన్, ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా మీరు సులభంగా మీ సమ్మతిని ఉపసంహరించవచ్చు ( సమ్మతి ఉపసంహరణ పత్రం చూడండి).
  • ప్రక్రియకి అభ్యంతరం తెలిపే హక్కు వర్తించే చోట వ్యక్తిగత డేటా యొక్క
  • ఫిర్యాదు నమోదు చేసే హక్కు. డేటా రక్షణ ప్రతినిధితో
  • ఏ సమయంలోనైనా మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీకు మార్కెటింగ్ సందేశాలు పంపించకుండా ఆపుచేయవలసిందిగా మీరు మమ్మల్ని లేదా మూడవ పక్షానికి చెందిన పార్టీల్ని అడగవచ్చు. ఈ మార్కెటింగ్ సందేశాలు అందుకోవడం ఆపుచేసిన చోట , ఉత్పత్తి /సేవ, కొనుగోలు, వారంటీ నమోదు, ఉత్పత్తి /సేవా అనుభవం లేదా ఇతర లావాదేవీల ఫలితంగా మాకు అందించబడిన వ్యక్తిగత డేటాకు ఇది వర్తించదు.
  • మా నుండి లేదా మా అనుబంధ సంస్థలు నుండి ఇక నుండి ఈమెయిల్ సమాచారం అందుకోవడాన్ని ఎల్లప్పుడూ నిలిపివేయవచ్చు. మీ కంపెనీ దివాలా కోసం దాఖలు చేసినప్పుడు లేదా మా వ్యాపారం బదిలీ చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు మినహా మేము మీ అనుమతి లేకుండా మీ ఈమెయిల్ అడ్రస్ ని ఏదైనా అనుబంధం కాని మూడవ పక్షానికి విక్రయించము, అద్దెకి ఇవ్వము లేదా వ్యాపారం చేయము.

మీ వ్యక్తిగత డేటాని మేము ఎంతకాలం ఉంచుతాము ?

వ్యాపారం లేదా చట్టబద్ధమైన లక్ష్యాలు కోసం మాకు తగిన విధంగా అవసరమైనంత కాలం మేము వ్యక్తిగత సమాచారం నిలిపి ఉంచుతాము. డేటా నిలిపివేసే సమయాల్ని నిర్థారిస్తూ, టీఎంఎల్ స్థానిక చట్టాలు, ఒప్పందపు బాధ్యతలు మరియు మా కస్టమర్స్ యొక్క అవసరాలు మరియు ఆశింపుల్ని పరిశీలిస్తుంది. మాకు వ్యక్తిగత సమాచారం అవసరం లేనప్పుడు, మేము దానిని సురక్షితంగా డిలీట్ చేస్తాము లేదా నాశనం చేస్తాము.

మార్పులు

టీఎంఎల్ ఎప్పటికప్పుడు గోప్యతా విధానాన్ని నవీకరించవచ్చు. ప్రస్తుతమున్న గోప్యతా విధానాన్ని చూడటానికి మా వెబ్ సైట్ ని తరచుగా తనిఖీ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. అందువలన టీఎంఎల్ మీ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తోంది మరియు రక్షిస్తోందని మీరు అవగాహనని కలిగి ఉంటవచ్చు. ఈ పాలసీకి మార్పు ప్రధానమైనది అయినప్పుడు మేము ఈ వెబ్ సైట్ లో ప్రధానమైన ప్రకటన ఉంచుతాము మరియు నవీకరించబడిన అమలైన తేదీ కేటాయిస్తాము.

కేటాయించిన డేటా రక్షణ

మాకు మీరు కేటాయించిన మీ వ్యక్తిగత డేటాని రక్షించడానికి మా వద్ద కఠినమైన భద్రతా చర్యలు ఉన్నాయి. మేము వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితమైన విధానంలో భద్రపరుస్తాము, అది నష్టపోవడం, దుర్వినియోగం, తప్పుగా వెల్లడించబడటం, మార్పు లేదా నాశనమవకుండా నివారిస్తాం. పేర్కొనబడిన భద్రతా చర్యలు క్రమానుగతంగా నవీకరించబడతాయి. అయితే, అలాంటి సమాచారం యొక్క ఏదైనా ఉద్దేశ్యపూర్వకం కాని నష్టం, దుర్వినియోగం, మార్పు లేదా వెల్లడింపు సహా వ్యక్తిగత సమాచారం యొక్క ఇంటర్నెట్ ప్రసారం సమయంలో భద్రత ఉల్లంఘించబడితే టీఎంఎల్ బాధ్యతవహించదు. ఇంకా, ఈ గోప్యతా విధానంలో ఏవైనా ఉన్నా కూడా, మీకు ఆపాదించబడే కారణంగా లేదా ఏదైనా మీ నియంత్రణలో లేని సంఘటన సంభవించినప్పుడు వ్యక్తిగత సమాచారం నష్టపోయినా, హాని కలిగినా లేదా దుర్వినియోగపరచబడినా అలాంటి నష్టం, హాని లేదా దుర్వినియోగానికి టీఎంఎల్ బాధ్యతవహించదు.

TML may disclose your personal data in good faith or whenever necessary to comply with a legal obligation or if disclosure was required by any law or by order of any competent court or statutory authority, to protect and defend the legal rights or Intellectual Property Rights of TML.

మీ బాధ్యతలు

ఈ ఉపయోగించే నియమాలు ద్వారా నిషేధించబడిన లేదా అనధికారమైన ఏదైనా లక్ష్యం కోసం మీరు వెబ్ సైట్ ని ఉపయోగించరని మీరు టీఎంఎల్ కి హామీ ఇస్తున్నారు. వెబ్ సైట్ కి హాని కలిగించడం , పని చేయకుండా చేయడం, అధిక భారం కలిగించడం లేదా ఆరంభమవకుండా చేయడానికి మీరు ఏ విధంగా కూడా వెబ్ సైట్ ని ఉపయోగించరు లేదా ఈ వెబ్ సైట్ ని ఏదైనా ఇతర పార్టీ ఉపయోగించడంలో లేదా ఆనందించడంలో జోక్యం చేసుకోరు. ఏదైనా మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మా నుండి ముందుగా సమ్మతి తీసుకోకుండా టీఎంఎల్ వెబ్ సైట్ నుండి పొందిన ఏదైనా డేటా, సేవలు విక్రయించడానికి, బదిలీ చేయడానికి , సవరించడానికి, కాపీ చేయడం, పంపిణీ చేయడం, ప్రసారం చేయడం, ప్రదర్శించడం, పునరుత్పత్తి చేయడం, ప్రచురించడం, లైసెన్స్ కి ఇవ్వడం, అప్పటికే ఉన్న పనులు నుండి ఉత్పన్నం చేయడం వంటివి చేయరు. ఈ మెటీరియల్స్ లేదా అక్కడ ఉన్న ఏదైనా భాగం వ్యక్తిగత మరియు వాణిజ్యేతర వాడకానికి మినహా కంప్యూటర్ లో భద్రపరచబడవచ్చు.

పాలన చట్టం /న్యాయ పరిధి

ఈ గోప్యతా విధానంలో భారతదేశంలో చట్టాలచే ఆదేశించబడుతుంది ; దీని ద్వారా తలెత్తే ఏవైనా వివాదాల్న పరిష్కరించడానికి ముంబయిలో న్యాయస్థానాలు ( భారతదేశం) కి ప్రత్యేకమైన అధికార పరిధి కలిగి ఉన్నాయి.

ప్రశ్నలు /సంప్రదించవలసిన సమాచారం

ఈ గోప్యతా ప్రకటన విధానానికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు లేదా వ్యాఖ్యానాలు ఉంటే, దయచేసి మమ్మల్ని :

Email: dpr@tatamotors.com

అమలయ్యే తేదీ: 23.03.22