Loading...
సంపూర్ణ సేవ

సంపూర్ణ
సేవ 2.0

సంపూర్ణ సేవ 2.0

మీరు టాటా మోటార్స్ ట్రక్ ని కొనుగోలు చేసినప్పుడు, మీరు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం లేదు, సర్వీస్, రోడ్డు సైడ్ సహాయం, బీమా, విధేయత మరియు ఇంకా మరెన్నో ఉన్న ప్రతీ దానితో కూడిన పలు సేవల్ని కొంటున్నారు. మీరు ఇప్పుడు మీ వ్యాపారం పై హృదయపూర్వకంగా దృష్టి సారించగలరు, సంపూర్ణ సేవ తక్కిన విషయాలు గురించి శ్రద్ధవహిస్తుంది.

సంపూర్ణ సేవ 2.0 సరికొత్త మరియు పెంపొందించబడిన సేవ. నిరంతరంగా మెరుగుపడుతున్న ఈ సమగ్రమైన సర్వీస్ ని తయారు చేయడానికి గత ఏడాదిలో మా కేంద్రాల్ని సందర్శించిన 6.5 మిలియన్ కస్టమర్లు నుండి మేము ప్రతిస్పందన సేకరించాము.

29 రాష్ట్ర కార్యాలయాలు, 250+ టాటా మోటార్స్ ఇంజనీర్లు, ఆధునిక సామగ్రి , సదుపాయాలు మరియు 24x7 మొబైల్ వ్యాన్లు ఉండే 1500కి పైగా ఛానల్ భాగస్వాముల సహాయం నుండి మీరు ప్రయోజనం పొందుతారు.

సంపూర్ణ సేవ 2.0

టాటా మోటార్స్ అందించే సంపూర్ణ సేవ మీ వాహనాన్ని కొనుగోలు చేయడం నుండి , మీ వ్యాపారం మీ ఇంట అడుగు పెట్టేంత వరకు మీ వ్యాపారానికి ఒక సంపూర్ణమైన సంరక్షణ ప్యాకేజీ. అది బీమా కావచ్చు లేదా బ్రేక్ డౌన్, రివార్డ్స్ లేదా జన్యుయిన్ స్పేర్స్, రీసేల్ లేదా వారంటీ కావచ్చు, సంపూర్ణ సేవ అన్నింటినీ కవర్ చేస్తుంది. ఇప్పుడు మీరు దేని గురించి విచారించనవసరం లేదు, కేవలం మీ వ్యాపారం పై దృష్టిసారించండి, తదుపరి స్థాయికి తీసుకువెళ్లండి.

ప్రధానంగా, టాటా మోటార్స్ మీతో ప్రతీ అడుగులో ఉంటుంది.

2 సంవత్సరాల వారంటీ

అన్ని యోధ పికప్‌లపై 3 సంవత్సరాల / 300000 కిలోమీటర్ల (ఏది అంతకు ముందు) డ్రైవ్‌లైన్ వారంటీతో, మీ వ్యాపారాన్ని పురోగతికి తీసుకెళ్లడానికి మేము ప్రయత్నిస్తాము.

కీలకమైన ఫీచర్లు

  • టాటా మోటార్స్ వారి విస్త్రతమైన డీలర్ షిప్ లో మరియు దేశవ్యాప్తంగా ప్రతీ 62 కిమీకి సర్వీస్ సదుపాయంతో 1500+ సర్వీస్ నెట్ వర్క్ టచ్ పాయింట్స్ లో మద్దతు చేయబడుతుంది.
టాటా డిలైట్

టాటా డిలైట్

2011 ఫిబ్రవరిలో ప్రారంభించబడిన టాటా డిలైట్ భారతదేశంలో వాణిజ్య వాహనాల పరిశ్రమలో మొట్ట మొదటి కస్టమర్ విధేయత కార్యక్రమం. టాటా వాహనాల్ని కొనుగోలు చేసిన కస్టమర్లు అందరూ ఆటోమేటిక్ గా ఈ లాయల్టీ కార్యక్రమంలో సభ్యులవుతారు.

ముఖ్యమైన ఫీచర్లు

  • టాటా మోటార్స్ అథీకృత సర్వీస్ అవుట్ లెట్స్, స్పేర్ పార్ట్స్ అవుట్ లెట్స్ మరియు ప్రోగ్రాం పార్ట్ నర్స్ వద్ద ఖర్చు చేసిన ప్రతీ రూ. 1,000 పై లాయల్టీ పాయింట్లు.
  • సభ్యత్వం చెల్లుబాటు 5 సంవత్సరాలు మరియు పాయింట్ల చెల్లుబాటు 3 సంవత్సరాలు.
  • రూ. 10 లక్షలు వరకు యాక్సిడెంటల్ డెట్/డిజెబిలిటి బెనిఫిట్ మరియు సభ్యత్వం చెల్లుబాటయ్యేంత వరకు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే రూ. 50,000 వరకు.
  • 12 లక్షలకు పైగా రీటైల్ కస్టమర్లు ఇప్పటికే కార్యక్రమంలో భాగంగా ఉన్నారు.
టాటా ఓకే

టాటా ఓకే

టాటా ఓకేతో, ముందుగా స్వంతం చేసుకున్న టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల్న మీరు విక్రయించవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి తప్పు పనులు జరగకుండా నివారించడానికి కొనుగోలు, సంపాదన మరియు మూల్యాంకనం, పునరుద్ధరణ మరియు పునరుద్ధరణ చేసిన వాహనాల సేల్ యొక్క ప్రతీ దశలో మా ప్రమేయం ఉంటుంది.

కీలకమైన ప్రత్యేకతలు

  • మీ ప్రస్తుతమున్న వాణిజ్య వాహనానికి ఉత్తమమైన రీసేల్ ధర పొందండి.
  • మీ ఇంటి వద్ద మూల్యాంకనం.
  • టాటా ఓకే ధృవీకరించబడిన వాహనాలు పై 80 శాతం వరకు ఫైనాన్స్ పొందండి.
  • టాటా ఓకే ధృవీకరించిన ప్రీ-ఓన్డ్ వాహనాలు పై వారంటీ
టాటా జెన్యుయిన్ భాగాలు

టాటా జెన్యుయిన్ భాగాలు

సంవత్సరాలు తరబడి టాటా వాణిజ్య వాహనాల్ని పరిపూర్ణమైన స్థితిలో ఉంచడానికి, మేము టాటా జెన్యుయిన్ పార్ట్స్ (టీజీపీ)ని అందిస్తాము. టాటా మోటార్స్ వారి విభాగమైన, టీజీపీ విడి భాగాలు యొక్క 1.5 లక్షలకు పైగా ఎస్ కేయులను టాటా వాణిజ్య వాహనాల్ని నిర్వహణకు అందిస్తోంది. ఈ విడి భాగాల్లో ప్రతీది వివిధ నాణ్యతా తనిఖీలు ద్వారా ఖచ్చితమైన వాహనం వివరణల్ని నెరవేర్చి తయారయ్యాయి, ఫలితంగా పరిపూర్ణమైన ఫిట్ గా ఏర్పడింది, పెరిగిన సర్వీస్ జీవిత కాలం మీ వాహనాన్ని ఎక్కువ దూరాలకు తీసుకువెళ్లడానికి ఎక్కువ అప్ టైంకి దారితీసింది.

కీలకమైన ప్రత్యేకతలు

  • 230కి పైగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ మరియు 20,000 ప్లస్ రీటైల్ అవుట్ లెట్స్ అయిదు వేర్ హౌస్ లుచే మద్దతు చేయబడుతున్నాయి.
  • ప్రతీ టాటా జెన్యుయిన్ పార్ట్స్ ఏదైనా ఇతర నాన్-జెన్యుయిన్ విడి భాగాలు కంటే ఉత్పత్తి దీర్ఘకాల అప్ టైం మరియు సర్వీస్ జీవిత కాలం అందించే విధంగా నిర్మించబడ్డాయి.
  • ప్రతీ భాగం ఖచ్చితమైన వాహనం వివరణలు ప్రకారం రూపొందించబటమే కాకుండా, అది పలు నాణ్యతా నియంత్రణ తనిఖీల్ని కూడా నెరవేర్చాలి.
టాటా మోటార్స్ సురక్ష

టాటా మోటార్స్ సురక్ష

పూర్తి నివారణ మరియు ప్రణాళికాబద్ధమైన నిర్వహణ, వాహనం డ్రైవ్ లైన్ యొక్క బ్రేక్ డౌన్ మరమ్మతుల్ని ముందుగా నిర్ణయించిన ధరకు సంరక్షణవహించే వార్షిక నిర్వహణ ప్యాకేజీ. ప్రస్తుతం, భారతదేశంవ్యాప్తంగా 60,000+కి పైగా కస్టమర్లు టాటా సురక్షని కలిగి ఉన్నారు. SCV కార్గో మరియు పిక్ అప్స్ కోసం 3-సంవత్సరాల కాంట్రాక్ట్స్ లభిస్తున్నాయి.

ప్యాకేజీలు మరియు చేరికలు

  • ప్లాటినం ప్లస్ : ఇంటి ముంగిట సమగ్రమైన కవరేజ్.
  • ప్లాటినం : సమగ్రమైన కవరేజ్.
  • గోల్డ్ : నివారణ నిర్వహణ + ఇతర మరమ్మతులు పై శ్రమ
  • సిల్వర్ : నివారణ నిర్వహణ కవరేజ్
  • బ్రాంజ్ : శ్రమ

*టాటా సురక్ష అసలు ఆఫర్ ప్యాకేజీల్ని సంబంధిత డీలర్ షిప్ నుండి తనిఖీ చేయాలి.
టాటా అలర్ట్

టాటా అలర్ట్

మా 24x7 రోడ్‌సైడ్ సాయం కార్యక్రమం అన్ని టాటా మోటార్స్ వాణిజ్య వాహన మోడళ్లకు వారంటీ వ్యవధిలో, దేశవ్యాప్తంగా ఎక్కడైనా, స్థానంతో సంబంధం లేకుండా 24 గంటల్లో పరిష్కారాన్ని వాగ్దానం చేస్తుంది.

కీలకమైన ఫీచర్లు

  • 30 నిముషాల అంగీకారం సమయం.
  • పగటి వేళ (ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు) మా బృందం మిమ్మల్ని 2 గంటల్లో చేరుతుంది మరియు రాత్రి వేళ (ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు) 4 గంటల్లో చేరుతుంది.
  • ఏదైనా ఆలస్యం జరిగితే, రోజుకి/500 నష్టపరిహారం చెల్లించబడుతుంది.
  • TGP మరియు ప్రొఫైల్ సమూహాలు యొక్క తదుపరి కొనుగోలు పై రెడీమ్ చేసుకోవచ్చు.

*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.

టాటా కవచ్

టాటా కవచ్

అత తక్కువ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు మరమ్మతు చేసే సేవలు ద్వారా టాటా కవచ్ మీ వ్యాపారం ఎన్నడూ కూడా ఆగిపోకుండా నిర్థారిస్తుంది. ఎంపిక చేయబడిన వర్క్ షాప్స్ లో మాత్రమే టాటా మోటార్స్ బీమా క్రింద బీమా చేయబడిన వాహనాలకు ఇది వర్తిస్తుంది.

కీలకమైన ఫీచర్లు

  • 15 రోజుల్లో మరమ్మతు చేస్తుంది లేదా లేనట్లయితే డెలివరీ ఆలస్యమైనందుకు కస్టమర్లకు ప్రతీరోజూ రూ. 500 నష్టపరిహారం చెల్లింపు.
  • ప్రమాదానికి గురైన వాహనాల మరమ్మతు గురించి టీఎంఎల్ అథీకృత యాక్సిడెంటల్ స్పెషల్ వర్క్ షాప్స్ కి నివేదించాలి.
  • 15 రోజులు దాటిన తరువాత ఆలస్యం ఆధారిత నష్టపరిహారం 24 గంటలు గుణకాలుగా ఉంటుంది.
  • • టాటా మోటార్స్ ఇన్స్యూరెన్స్ టోల్ ఫ్రీ నంబర్ 1800 209 0060 ద్వారా సులభంగా కాల్స్ రౌట్ చేయబడి, రిజిస్టర్ చేయబడతాయి.

*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.

టాటా మోటార్స్ ప్రోలైఫ్

టాటా మోటార్స్ ప్రోలైఫ్

వాహనం డౌన్ టైం మరియు మొత్తం యజమాని ఖర్చుని తగ్గించడానికి ఎక్స్ ఛేంజ్ ఆధారంగా మళ్లీ-తయారు చేయబడిన ఇంజన్లను టాటా మోటార్స్ ప్రొఫైల్ అందిస్తుంది.

కీలకమైన ప్రత్యేకతలు

  • పునః తయారీ సమూహాల శ్రేణి ఇంజన్ లాంగ్ బ్లాక్, క్లచ్ , మరియు కొత్త విడి భాగాలు యొక్క ఎంఆర్పీ యొక్క 40 శాతం నుండి 80 శాతం ధరకి కాబిన్ తో సహా 75కి పైగా ఉత్పత్తుల్ని కవర్ చేస్తుంది.
  • అవి ఏవైనా పునః తయారీ లేదా సామగ్రి లోపాలకు వారంటీ చేయబడతాయి.
టాటా జిప్పీ

టాటా జిప్పీ

టాటా జిప్పీ అన్ని BS6 వాహనాలు కోసం మరమ్మతు సమయం యొక్క హామీ కార్యక్రమం. ఇది టోల్ -ఫ్రీ నంబర్ ద్వారా లేదా వర్క్ షాప్ లో నివేదించిన ఏదైనా సమస్యకు ఫాస్ట్-ట్రాక్ సర్వీస్ ని సేల్ తరువాత 12 నెలలు లోగా లేదా వాహనం ఉత్పత్తి చేసిన 14 నెలలు తరువాత , ఏది ముందు అయితే దాని ప్రకారం పూర్తి చేస్తుంది.

ముఖ్యమైన ప్రత్యేకతలు

  • 8 గంటల్లోగా వర్క్ షాప్ వద్ద రెగ్యులర్ సర్వీస్ కోసం హామీతో కూడిన సమస్యా పరిష్కారం మరియు ప్రధాన సమూహాల మరమ్మత్తులు 24 గంటల్లోగా పరిష్కరించబడతాయి.
  • ఆలస్యం జరిగితే వర్క్ షాప్ లో నివేదించబడిన వారంటీ వాహనాలు కోసం మాత్రమే అన్ని ఎస్ సీవీ కార్గో మరియు పిక్అప్ ట్రక్స్ కోసం ప్రతీ రోజూ రూ. 500 నష్టపరిహారం చెల్లించబడుతుంది. ఆలస్యమైనందుకు నష్టపరిహారం చెల్లింపు 24 గంటలు తరువాత ప్రారంభమవుతుంది.

*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.